
బిగ్ బాస్ సీజన్ 4 పై మొదటి నుంచి ఏదొక విమర్శ లేదా వ్యతిరేకత వినిపిస్తూనే ఉన్నాయి. కంటేస్టెంట్ల ఎంపిక మొదలు నిర్వహించే టాస్క్‌లు, ఓటింగ్ పద్దతి ఇలా అనేక అంశాలతో బిగ్ బాస్ పై అసంతృప్తిగా ఉన్నారు నెటిజన్లు. కరోనా సమయంలో కూడా ఎక్కడా వెనుకడుగు వేయ్యకుండా మొదలవ్వడంతో ఇక 100రోజులు మజా అనుకున్న వారికి నిరాశే మిగిలింది. తెలియని మోహాలు తీసుకొచ్చి నిరాశపరిచిన యాజమాన్యం దాన్ని భర్తీ చేసేందుకు వరుసగా ముగ్గురిని వైల్డ్ కార్డు ఎంట్రీలుగా ఇంట్లోకి పంపారు. అవి కూడా బెడిసికొట్టాయి. అవినాష్ మినహా మిగతా ఇద్దరు ఇంటి బాట పట్టారు. ఇది కాకుండా ఇంట్లో ఉన్నవారే అనారోగ్యంతో బాధపడుతూ టాస్క్‌లు సరిగ్గా అడకుండా బయటకు వచ్చారు. అందుకే సమంతను తెచ్చి, సుమను పిలిపించి ఏ సీజన్ కు చేయని హడావుడి చేస్తున్నారు కానీ లాభం లేకపోయింది. ఇక ఇప్పుడు మరో ప్రయత్నంగా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కుమార్ సాయిని మళ్ళీ ఇంట్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. గత సీజన్లో కూడా 11వ వారం ఎలిమినెట్ అయిన అలీ రైజా ఇంట్లోకి రి ఎంట్రీ ఇచ్చి ఫైనల్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. మరి ఈ సీజన్ కు కుమార్ సాయి అలీ రైజా అవ్వనున్నాడా చూడాలి.