
బిగ్ బాస్ సీజన్ 4 మొదలై చూస్తుండగానే గ్రాండ్ ఫినాలే వీక్ కు చేరుకుంది. ఇంకో ఆరు రోజుల్లో ఈ సీజన్ విన్నర్ అనేది ఎవరన్నది తెలిసిపోతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మోనాల్ ఎలిమినేటి అవ్వగా నెటిజన్లు హమ్మయ్య ఇప్పటికైన పంపారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది పక్కన పెడితే మొన్నటి ఎపిసోడ్ లో టాస్క్ లో భాగంగా మోనాల్ నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతూ అఖిల్ మొదట్లో ఎక్కువ మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ లాగా అని చెప్పి....అఖిల్ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ చూసాను నేను మోస్ట్ డిజరైబుల్ మెన్ అని ఉందంటూ చెప్పింది. దీంతో మోనాల్ కు అఖిల్ వస్తాడని ముందే తెలుసా? వాళ్ళ మధ్య జరిగిందంతా బిగ్ బాస్ ముందే ప్లాన్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.