
బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకు అతి చేరువలో ఉంది. అందుకే ఇంట్లో మిగిలున్న సభ్యుల అసలు రంగులు మెల్లిగా బయటపడుతున్నాయి. ఒక్కరికి ఒక్కొక్కరు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అలాగే కొందరికి కొందరంటే పడట్లేదు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో మోనాల్ డబల్ గేమ్ ఆడినట్లు నెటిజన్లకు అనిపించింది. అఖిల్, సోహెల్ మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయమే. అవసరమైనప్పుడల్లా ఒకరి కోసం ఒకరు ఉంటూ మంచి బాండింగ్ కలిగున్నారు. మరి అది చూసి తట్టుకోలేకనో లేక తనతో ఉండటం మానేసి సోహెల్ తో ఉంటున్నాడనో మోనాల్ అఖిల్ కు సోహెల్ గురించి మసాలా దట్టించి మరి చెప్పే ప్రయత్నం చేసింది. సోహెల్ అందరిలో మంచిగా ఉండటానికి చూస్తున్నాడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ ఎక్కేసి చెప్పింది. కానీ ఆమె మాటలను పెడచెవిన పెట్టాడు అఖిల్. మోనాల్ మాటలు విన్న సోహెల్ మరియు అఖిల్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు.