
బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ నాగార్జున తన సినిమా 'వైల్డ్ డాగ్' షూటింగ్ నిమిత్తం మనాలి వెళ్లడంతో ఆ బాధ్యతను కోడలు అక్కినేని కోడలు సమంతకు అప్పగించారు. అయితే సమంత హోస్ట్ చేసిన ఆ దసరా మ్యారథాన్ సక్సెస్ ఫుల్ గా సాగింది. ఎంత సక్సెస్ అయిందంటే ఆ ఎపిసోడ్ కు అదిరిపోయే టిఆర్పిలు వచ్చాయి. సమంత మ్యారథాన్ కు 11.3 టిఆర్పి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ కి 18 రేటింగ్ వచ్చింది అంటే సుమారు 4.5 కోట్ల మంది వీక్షించినట్లు. ఏదైనా రేటింగ్ పెరుగుతూ పోవాలి కానీ బిగ్ బాస్ షోకు తగ్గుతూ పోయింది. దీంతో నాగార్జున లేని సమయంలో సమంతను దింపి మహా ఎపిసోడ్ చేసి మళ్ళీ టిఆర్పి రేస్ లో పుంజుకుంది.