
బిగ్ బాస్ సీజన్ 4 ఐదొవ వారం కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని 6వ లోకి అడుగుపెట్టింది. అయితే అందరూ ఊహించినట్లుగానే గంగవ్వ ఆరోగ్య స్థితి బాగాలేదని ఆమెను ఇంటి నుంచి పంపేశారు. ఇక మాములు నామినేషన్లలో ఉన్న వాళ్లలో సుజాత ఎలిమినేటి అయింది. సుజాత వెళ్తూ వెళ్తూ ఇంట్లో అందరితో సరదాగా ఉంటున్న ముక్కు అవినాష్ పరువు తీసింది. అవినాష్ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు బయట సంబంధాలు చూస్తున్నారని చెప్తూనే ఉన్న విషయం తెలిసిందే. మరి లోపల సుజాత, అవినాష్ మధ్య ఎం జరిగిందో తెలియదు కానీ ఆమె వెళ్తూ వెళ్తూ 'నీకు పెళ్లి ఎట్లా అయితదో చూస్తా. నీకు పెళ్లి కానివ్వను' అంటూ కామెంట్లు చేసింది. నాగార్జున కూడా ఆమెకు వత్తాసు పలుకుతూ...చూడండి అవినాష్ కు పిల్ల నించే అత్తలు అంటూ ఆటపట్టించారు. సుజాత మాటలకు అవినాష్ ఒక్క నిమిషం షాక్ అయ్యాడు.