
బిగ్ బాస్ చివరి రెండు వారాలకు చేరేసరికి ఇంట్లోని సభ్యుల మధ్య అన్ని మారిపోతూ వస్తున్నాయి. మొదట్లో అభిజీత్ హారికల మధ్య ఫ్రెండ్షిప్ చూసి ముచ్చటేసేది. ఎవరికీ ఎటువంటి బాధ ఉన్న కూర్చొని షేర్ చేసుకొని ముందుకు సాగేవారు. అందుకే 'అభిక' అనే పేరు సోషల్ మీడియా లో ట్రెండ్ అయింది. కానీ గత రెండు వారల నుంచి మాత్రం సిన్ రివర్స్ అయింది. నాగార్జున అన్న మాటలకూ హారిక ఏకంగా అభిజీత్ ను దూరం పెట్టడం మొదలు పెట్టింది. నాగార్జున అన్నారంటే బయట కూడా అలానే అనుకుంటున్నారేమోనని హారిక ఫీల్ అయ్యి అభిను దూరం పెడుతూ మిగితా ఇంటి సభ్యులతో క్లోజ్ గా ఉంటుంది. అఖిల్ అయితే హారికకు హగ్గులు, ముద్దులు ఇచ్చేస్తూ రెచ్చిపోతున్నాడు. ఇక తట్టుకోలేక అభి నిన్న రాత్రి 'ప్లైస్ నాతో కొంత టైం స్పెండ్ చెయ్యి' అని లెటర్ రాసి హారిక బెడ్ పై పెట్టాడు. ఆ లెటర్ చదివి హారిక అభి బెడ్ వద్దకు వెళ్లి 'నువ్వు నా క్యూటీ కదా...'అంటూ ఐస్ చేసే ప్రయత్నం చేసింది.