
బిగ్ బాస్ సీజన్ 4 మిగితా సీజన్లతో పోల్చుకుంటే వెనుకబడింది లేదా అంత ఆసక్తిగా లేదనే చెప్పొచ్చు. దానికి మొదటి కారణం ఇంట్లోని సభ్యులు. ఎలాగోలా జిమిక్లు చేసి కొన్ని ఎపిసోడ్స్ కు ప్రేక్షకుల దృష్టిని లాగారు యాజమాన్యం. ఇకపోతే సీజన్ 2 లో కౌశల్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఏర్పడిందో ఈ సీజన్ లో అభిజీత్ కు అలాంటి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సోషల్ మీడియాలో అభిజీత్ ఫ్యాన్స్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అతను టాప్ 2 లో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. అయితే అతను విన్నర్ ఎందుకు అవ్వచ్చు? అంటే... డ్యాన్స్ రాకపోయినా డ్యాన్స్ వెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. గొడవలు జరిగినప్పుడు ఆవేశంతో కన్నా ఆలోచనతో మాట్లాడతాడు, గుడ్ లుక్స్, చాకచక్యంగా టాస్క్‌లు ఆడతాడు, ఒక్క మాట మీదనే నిలబడతాడు ఇలా ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయని చెబుతున్నారు నెటిజన్లు. అందుకే బయట అతనికి బ్రహ్మరధం పడుతున్నారు. మరి చివరకు అభిజీత్ విన్నర్ గా నిలుస్తాడా లేదో చూడాలి.