
తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ - 4 కంటెస్టెంట్లలో గంగవ్వకు ఎంతో ప్రత్యేకత ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె వయసు దృశ్య ఆమె మొన్న జరిగిన కాయిన్స్ టాస్క్‌లో పాల్గొనలేదు. అయితే ఆ తర్వాత ఎపిసోడ్ లో జరిగిన ఫ్యాషన్ షోలో అవ్వ, తనకు కుదిరినమేర బాగానే ప్రయత్నించింది. కానీ మిగితా అమ్మాయిలు మాత్రం చాలా బాగా మెప్పించారు. అయినా కూడా అవ్వనే విజేతగా ప్రకటించారు. ఇది చూసిన నెటిజన్లు అది ఎంతవరాలు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. అవ్వ వయసు పెద్దదే అవ్వొచ్చు అంత మాత్రాన గేమ్ లో పక్షపాతం ఎన్నిరోజులు చుప్పిస్తారంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. గంగవ్వపై ఉన్న సింపతీతో, ప్రతి ఒక్కరూ ఆమె తరఫున నిలుస్తూ, కావాలనే భజన చేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. దీంతో రానున్న వారాల్లో గంగవ్వతో బిగ్ బాస్ ఏం చేయిస్తారు? తనపై వస్తున్న వ్యతిరేకతను స్వయంగా చూస్తున్న బిగ్ బాస్, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది. గంగవ్వను దృష్టిలో పెట్టుకొని టాస్క్‌లు పెడితే బిగ్ బాస్ కు కావాల్సిన కంటెంట్ రాదు అలాని ఫిజికల్ టాస్క్‌లు గంగవ్వ చెయ్యలేదు. మరి ఆమె కోసం ప్రత్యేకించి వేరే టాస్క్‌లు పెడతారా? లేదా అవ్వను ఇంటికి పంపే ఆలోచన చేస్తారా? అనేది చూడాలి.