
బిగ్ బాస్ సీజన్ 4 ఎందుకు ముందు సీజన్ల కంటే ఆసక్తిగా లేదంటే బోలెడు కారణాలే ఉన్నాయి. అందులో ఒకటి కంటెస్టెంట్స్ ఎవరికీ పెద్దగా తెలియకపోవడం, కొంతమంది అనారోగ్యంతో బాధపడటం, టాస్క్‌లు కొత్తగా లేకపోవడం అన్నిటికన్నా ముఖ్యం ముందుగానే లీక్స్ వచ్చేయటం. ఇదిలా ఉంటే నిన్నటి టాస్క్ లో హారిక, అభిజీత్ లు కసితో ఆడినట్లు కనిపిస్తుంది. అది నామినేషన్ ఎఫెక్ట్ అని తెలుస్తుంది. కసితో ఆడి కెప్టెన్సీ పోటీదారులుగా హారిక, అభిజీత్ ఎంపికవ్వగా అఖిల్ కూడా ఎంపికయ్యారు. అయితే హారిక ఇప్పటికే 6 సార్లు కెప్టెన్సీ పోటీదారుగా ఎంపికయ్యి టాస్కుల్లో ఓడిపోయింది. మరి ఈసారి ఆమె కోసం అభిజీత్ త్యాగం చేస్తాడా? అఖిల్ తగ్గుతాడా? అనేది తెలీదు. ఇక ఈరోజు ఎపిసోడ్ మాత్రం కుటుంబ సభ్యులతో ఫుల్ ఎమోషనల్ గా సాగనున్నట్లు తెలుస్తుంది.