
భాగమతి సినిమా తర్వాత అనుష్క మరే సినిమాలోనూ కనిపించలేదు. త్వరగా సినిమా చేయటం కన్నా మంచి సినిమా చేయటం ముఖ్యం అనుకున్న స్వీటీ చాలా సైలెంట్ గా తన తదుపరి సినిమాపై వర్క్ చేసింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నిశ్శబ్దం' లో అనుష్క నటిస్తుంది. పేరుకు తగ్గట్లుగానే ఈ సినిమా గురించి ఏ వార్త లేకుండా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అంచనాలను పెంచింది. అసలైతే ఈ సినిమా జనవరి 31న రిలీజ్ అవ్వాల్సి ఉంది..కానీ తాజా సమాచారం ప్రకారం సినిమా రిలీజ్ ను ఫిబ్రవరికు పోస్ట్ పోన్ చేశారట. దానికి కారణం బయర్స్ లేకపోవటమేనట. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో నిశ్శబ్దంను రిలీజ్ చేద్దాం అనుకున్నారు మేకర్స్. కానీ మిగితా భాషల్లో బయర్స్ నుండి ఆశించిన స్థాయిలో ధర పాలకకపోవడంతో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇందులో అనుష్క డెఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ చేస్తుంది.