
బెల్లoకొండ శ్రీనివాస్ నటించిన మొదటి చిత్రం "అల్లుడు శ్రీను" బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయం సాధించింది. మొదటి చిత్రం హిట్ అవ్వడంతో అదే అల్లుడు సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, చాలా కాలం తరువాత శ్రీనివాస్ "అల్లుడు అధర్స్" అనే మరో ఉల్లాసమైన ఎంటర్టైనర్తో వస్తున్నాడు. మేకర్స్ తాజాగా టైటిల్ పోస్టర్ తో సహా విడుదల తేదీని కూడా ప్రకటించారు. టైటిల్ పోస్టర్లో, బెల్లంకొండ స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. పోస్టర్ లో బెల్లంకొండ పోజ్ చూస్తుంటే... తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. స్పష్టంగా, కథానాయికలుగా నటిస్తున్న నభా నటేష్ నో, అనుఇమాన్యుల్ నో చూస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ మరియు పోస్టర్ ద్వారా ఈ చిత్రం పూర్తి ఎంటర్టైనర్ కానున్నట్లు అర్ధం అవుతుంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోను సూద్, ప్రకాష్ రాజ్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఏప్రిల్ 30వ తేదీన సినిమా రిలీజ్ కానుంది.