
యువ నటుడు నితిన్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించిన రొమాంటిక్, కామెడీ చిత్రం 'భీష్మ' బాక్సాఫీస్ వద్ద అద్భుత కలెక్షన్లు సాధిస్తుంది. వారం క్రితం విడుదలైన భీష్మ చిత్రంపై పైరసీ వేటు పడింది. ఆ మధ్య హైదరాబాద్ నుండి మైసూర్ వెళ్తున్న బస్సులో వెంకటేష్ యొక్క కొంతమంది అభిమానులు ఆ బస్సులో 'వెంకీ మామా' యొక్క పైరేటెడ్ వెర్షన్ ప్లే చేస్తున్నట్లు గుర్తించి ఆ బస్సు డ్రైవర్ పై కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'అర్జున్ సురవరం' చిత్ర పైరేటెడ్ వర్షన్ కూడా కేస్ఆర్టీసీ లో ప్లే చేసిన విషయం ఆ మధ్య వెలుగులోకి వచ్చింది. తాజాగా భీష్మ చిత్ర పైరసీ వెర్షన్ కేస్ఆర్టీసీ బస్సులో ప్లే అవ్వడంతో చిత్ర డైరెక్టర్ వెంకీ కడుముల ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కేటీఆర్ సమాధానంగా "పైరసీని కఠినంగా అరికట్టడానికి రవాణా మంత్రి పువ్వడ అజయ్ కుమార్ గారుతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకుంటామని" ట్వీట్ చేశారు.