
బుధవారం ఉదయం, అశ్విని దత్ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎప్పటికప్పుడు కొన్ని ఎక్కువ బడ్జెట్‌తో చిరస్మరణీయమైన చిత్రాలను నిర్మిస్తోంది. తాజాగా వారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పెట్టారు, "కొద్ది గంటల్లోనే మీకు ఆశ్చర్యం కలిగించే అనౌన్స్మెంట్ వస్తుంది" అని తెలిపారు. ఇది ఒక్కసారిగా అందిరిలోను ఆసక్తిని రేపింది. మొదట అట్లీ దర్శకత్వం వహించబోయే జూనియర్ ఎన్టీఆర్ చిత్రం కోసం అశ్విని దత్ జతకడుతున్నాడని భావించినప్పటికీ, ఈ ప్రకటన వేరేదని అనిపిస్తుంది. అశ్విని దత్ అల్లుడు మరియు జాతీయ అవార్డు గెలుచుకున్న "మహానటి" సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ప్రభాస్‌ను స్క్రిప్ట్‌తో ఆకట్టుకున్నాడు. రాబోయే ప్రకటన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే సినిమా అని అంచనాలు వేస్తున్నారు. మరి ఇంతకీ ఆ ప్రకటన ఏంటో తెలియాలి అంటే కొన్ని గంటలు వేచి చూడాలి.