
ప్రభాస్ హీరోగా మహానటి చిత్రం ఫెమ్ నాగ్ అశ్విన్ తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ కాంబోలో సినిమా వస్తుంది అంటేనే అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆ అంచనాలకు తగ్గట్టుగానే భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ కధానాయిక దీపికా పదుకొనెను ఎంపిక చేశారు. అదే పెద్ద న్యూస్ అంటే ప్రభాస్ పుట్టినరోజుకు ఇంకా సమయం ఉండగానే మరో పెద్ద అప్డేట్ ను రిలీజ్ చేసింది #ప్రభాస్21 టీం. ఈ సినిమాలో కేవలం గెస్ట్ రోల్ కాకుండా ఫుల్ లెన్త్ రోల్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమాను ఏ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారో అర్ధం అయిపోయింది.