
మల్టీస్టారర్ ట్రెండ్ స్టార్ట్ అయింది మహేష్ బాబు చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' తోనే. ఈ సినిమాలో మహేష్, వెంకటేష్ లు నటించగా ఆ తర్వాత నుంచి మల్టీస్టారర్ల హవా పెరిగిపోయింది. సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు అని తేడా లేకుండా అన్ధసృ మల్టీస్టారర్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే తాజా న్యూస్ ప్రకారం, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి భారీ మల్టీస్టారర్ లో నటించనున్నారు. దీన్ని మొదట అల్లు అరవింద్, అల్లు అర్జున్ కలిసి నిర్మిద్దాం అనుకున్నప్పటికి అది కుదరలేదు. ఇప్పుడు ఈ క్రేజీ మల్టీస్టారర్ ను అల్లు అరవింద్ సోలోగా నిర్మించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీనికి మహేష్, ఎన్టీఆర్ లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద రచయితలు కధను రాసే పనిలో పడ్డారు. ఈ రూమర్ త్వరలో నిజం అవ్వాలి అని కోరుకుందాం.