
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మళ్ళీ రీఎంట్రీను గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు. పరిస్థితులు మాములుగా ఉండి ఉంటే ఈపాటికి వకీల్ సాబ్ విడుదలైపోయేది. క్రిష్ తో సినిమా షూటింగ్ సగం పూర్తయ్యేది. ఇక ఈ రెండూ కాహరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయాలని నిర్ణయించుకున్న సంగతి కూడా తెల్సిందే. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అంటే సెప్టెంబర్ 2న ఈ సినిమా విశేషాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ డైరెక్ట్ గా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా ఒక అప్డేట్ ఉంటుందని చెప్పారు. హరీష్ శంకర్ తో పవన్ చేయబోయే సినిమా టైటిల్ తో పాటు ఒక పోస్టర్ ను కూడా వదుల్తారని తెలుస్తోంది. అలాగే హీరోయిన్ గా పూజ హెగ్డే పేరుని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తంగా పవన్ పుట్టినరోజు నాడు మొత్తం మూడు అప్డేట్స్ ఉండనున్నాయన్నమాట.