
బిగ్ బాస్ సీజన్ 4 కరోనా సమయంలో ఎలా నడుస్తుందో ఏంటో అన్న సందేహాల మధ్య మొదలై చూస్తుండగానే 10వ వారంలోకి వచ్చేసింది. 16 మంది తో మొదలైన షో ఇప్పుడు 9 మందికి చేరింది. అందుకే మరింత ఆసక్తిగా మారింది. ఏ నిమిషం ఎటువంటి ట్విస్టులు ఉంటాయో తెలియడం లేదు.ఇక ఈ వారం నామినేషన్లలో అభిజీత్, అరియనా, మెహబూబ్, సోహెల్, మోనాల్, హారికలు ఉన్నారు. ఈసారి మాత్రం గట్టి పోటీ ఉండబోతుంది. నామినేషన్స్ లో ఉన్న అందరికి బయట ఎంతోకొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఈ వారం వాళ్ళు అదే అట మీద ఆధారపడి ఉంటుంది ఇంట్లో ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు అనేది. కానీ అభిజీత్ కు మాత్రం ఏ వారమైన డోకా లేదేమో అనిపిస్తుంది. అతనికి బయట అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా వచ్చిందో ఎప్పుడు వచ్చిందో తెలీదు కానీ సుమారు అన్ని వారలు నామినేట్ అవుతూ సేవ్ అవుతూ వస్తున్నాడు.