
కరోనా లాంటి మహమ్మారి సమయంలో కూడా ఎంటర్టైన్మెంట్ లో నో కాంప్రమైజ్ అంటూ బిగ్ బాస్ సీజన్ 4 తో వచ్చేసాడు కింగ్ నాగార్జున. భారీ అంచనాల నడుమ నిన్న సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా మొదలయింది. మాస్క్ మాకు ఎంటర్టైన్మెంట్ మీకు అంటూ నాగ్ రేటింపు జోష్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. అయితే నిన్న హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 16 మంది కంటెస్టెంట్లలో సుమారు అందరూ ఊహించిన వాళ్లే ఉండటం విశేషం. ఇంతకీ హౌస్ లోకి అడుగుపెట్టిన వాళ్ళు వీళ్ళే....అభిజీత్, గంగవ్వ, మోనాల్ గజర్, దేత్తడి హారిక, మెహబూబా, నోయెల్, జోర్దార్ సుజాత, యాంకర్ లాస్య, అరియానా గ్లోరీ, అమ్మా రాజశేఖర్, కరాటే కళ్యాణి, దివి వడ్త్యా, అఖిల్ సార్థక్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ సయెద్ సోహెల్ లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి వీళ్ళలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.