
బిగ్ బాస్ లో మజా తగ్గింది అనాలో లేదా సభ్యులు తగ్గడం వల్ల అలా అనిపిస్తుంది అనాలో తెలియడం లేదు. ఏదేమైనా మాత్రం ఆ మ్యాజిక్, జోష్ మాత్రం కచ్చితంగా మిస్ అయింది. నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంటి సబ్యులకు చివరి బంతి అనే టాస్క్ ను ఇచ్చారు బిగ్ బాస్. ఆ రేస్ లో చివరికి సోహెల్, అఖిల్, మెహబూబ్ మిగలగా సోహెల్ తాను ఒకసారి కెప్టెన్ అయినందున పక్కకు తప్పుకుంటానని మీ ఇద్దరిలో ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోవాలని రేస్ నుండి బయటకు రాగ అఖిల్, మెహబూబ్లు మిగిలారు. ఎవరు ఒకరు కాంప్రమైజ్ అయితేనే కెప్టెన్ అవుతారు కానీ ఇక్కడ ఇద్దరు కాంప్రమైజ్ అవ్వకుండా నాకు ముఖ్యమంటే నాకు ముఖ్యమంటూ చివరికి ఎవరికీ రాకుండా పోయింది. గేమ్ నియమాలను పాటించనందుకు బిగ్ బాస్ ఈ వారం ఎవరు కెప్టెన్ ఉండరని ఇమ్యూనిటీ ఎవరికీ రాదని చెప్పారు. దీంతో సోహెల్ మీకు అనవసరంగా వదిలాను కదా అంటూ బాధపడ్డాడు.