
నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ పెద్ద డ్రామాకు తెరలేపారు. మీకు ఆటలో అడొచ్చేది ఎవరు? మీరు స్ట్రాంగ్ అని భావించింది ఎవరో? అందరూ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకొని బిగ్ బాస్ కు చెప్పాలని వాళ్ళు ఇంటి నుండి వెళ్తారని చెప్పడంతో అందరూ సుదీర్ఘ చర్చల తర్వాత అఖిల్ పేరును చెప్పారు. దీంతో అఖిల్ ఇంటి నుండి బయటకు పంపారు. అయితే ఇంటి సభ్యులు అతను ఎలిమినేటి అయ్యాడని అనుకుంటుండగా బిగ్ బాస్ అతన్ని సీక్రెట్ రూమ్ లో ఉంచారు. అక్కడి నుంచి అఖిల్ అందరి ఆటను చూస్తూ మరియు వారి మాటలను వింటున్నాడు. ఈనేపథ్యంలో మోనాల్ అఖిల్ ను తలుచుకుంటూ పాట పడుతూ దిండుతో మాట్లాడుతున్నది చూసి మురిసిపోయాడు. తర్వాత మోనాల్ వచ్చి అభిజీత్ తో మాట్లాడుతూ నువ్వు స్ట్రాంగ్ కదా అంటూ డైలాగ్ వేసింది. దీంతో ఈమె ఏందో అసలు అర్ధం కాదు అంటూ అఖిల్ సెటైర్ వేసాడు. మరి మునుముందు ఎం జరుగుతుందో చూడాలి.