
తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ మూడు సీజన్లు అధిక టిఆర్పీలతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 16 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. ఇంట్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ ఫ్రెం లో కనిపిస్తుంటే ఒక్కరు మాత్రం అసలు ఉండి లేనట్లుగా ఉంటున్నారు. ఆవిడే నటి 'దివి వాదత్య'. అసలు వచ్చిన మొదటిరోజు నుంచి ఆమె మాట్లాడిన నిమిషమే లేదు. ఆమె మౌనంపై ఇప్పటికే సోషల్ మీడియాలో మిములు రచ్చ చేస్తున్నాయి. దివి ఎప్పుడు మాట్లాడుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఆ సమయం రానే వచ్చింది. నిన్నటి ఎపిసోడ్ లో సైలెన్స్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేయటమే కాకుండా ఇంటి సభ్యుల ప్రవర్తన గురించి కుండ బద్ధలుకొట్టినట్లుగా మాట్లాడింది. మొదటిసారి నోరు తెరవడమే రచ్చకు దారితీసింది. ఇది చూసిన ప్రేక్షకులు ఇక నుంచి హౌస్ మరో లెవెల్ లో ఉంటుందని ఊహిస్తున్నారు.