
నాగార్జున హోస్ట్ చేయనున్న బిగ్ బాస్ తెలుగు నాల్గవ సీజన్ సెప్టెంబర్ 6న ప్రారంభం కానుంది. 16 మంది కంటెస్టెంట్లను ఇప్పటికే షో నిర్వాహకులు ఖరారు చేయగా...వారిని హైదరాబాద్ లో ఒక హోటల్ లో క్వారెంటైన్ లో ఉంచారు. అయితే ఆ 16 మందిలోముగ్గురికి కరోనా పాజిటివ్ అని తెలడంతో యాజమాన్యం భయాందోళనకు గురవుతున్నారు. కోవిడ్ -19 కు పాజిటివ్ గా నిర్ధారణ అయిన ముగ్గురు పోటీదారులలో మై విలేజ్ షోకు చెందిన యూట్యూబ్ స్టార్ మిల్కూరి గంగవ్వా ఒకరు. మరో యువ గాయకుడుతో పాటు మరొక కంటెస్టెంట్ కరోనావైరస్కు పాజిటివ్ గా పరీక్షించబడ్డారు. మరి మూడో కంటెస్టెంట్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.