
16 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ సీజన్ 4 మంచి హంగులు, హడావుడితో మొదలైంది. 16 మందిలో రెండో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు డైరెక్టర్ సూర్య కిరణ్. మొదట ఇయనని చూసిన వారు ఎవరబ్బా ఇతను అనుకోవచ్చు కానీ హీరో సుమంత్ నటించిన 'సత్యం' మూవీ అభిమానులకు మాత్రం కచ్చితంగా సూర్య కిరణ్ సూపరిచితుడే. సత్యం లాంటి మంచి డీసెంట్ మూవీని డైరెక్ట్ చేసింది సూర్య కిరణే. బిగ్ బాస్ హౌస్ లో మరో బిగ్ బాస్ గా ఫీల్ అవుతున్న సూర్య కిరణ్ 1977 సెప్టెంబర్ 30న జన్మించారు. అయితే సూర్య కిరణ్ కు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. అందులో ఒకరే బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన సీరియల్ వదినమ్మ హీరోయిన్ సుజితా ధనుష్. మరొకరు సునీత. డైరెక్టర్ సూర్య కిరణ్ ప్రముఖ నటి కల్యాణిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక పాప కూడా ఉంది. కానీ ఏవో కుటుంబ మనస్పర్థలు కారణంగా ఇద్దరు 2016లో విడిపోయారు. ఇప్పుడు ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా వెండితెరకు దూరమైన సూర్య కిరణ్ మళ్ళీ ఇన్నాళ్లకు బిగ్ బాస్ కు ఎంట్రీ ఇచ్చారు.