
బిగ్ బాస్ హడావుడి మొదలైపోయింది. బిగ్గెస్ట్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ తెలుగులో మూడు సీజన్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకొని ఇప్పుడు నాలుగో సీజన్ కు సిద్ధమవుతుంది. కరోనా వ్యాధి ఉన్న సరే, జాగ్రత్తలు పాటిస్తూ షో స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిన యాజమాన్యం ఆ దిశగా పరుగులుతీస్తుంది. సీజన్ 4 కి కూడా అక్కినేని కింగ్ నాగార్జున హోస్ట్ గా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇప్పటికే యాజమాన్యం నాగ్ తో ప్రోమోను షూట్ చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. మరి వరసగా ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్ వస్తుంటే కంటెస్టెంట్ల గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలవ్వకుండా ఉంటుందా? ఎక్కడ చూసినా కంటెస్టెంట్లకు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కంటెస్టెంట్లను క్వరైంటైన్ లో ఉంచి, కోవిడ్ నెగిటివ్ నిర్ధారణ అయిన తరువాతే హౌస్ లోకి పంపించే ఏర్పాట్లు చేశారు. అందుకు అంగీకరించి, క్వరైంటైన్ లోకి వెళ్లి ఆ తరువాత హౌస్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఓ పంది మంది పేర్లు ప్రముఖంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ పది మంది నటి సురేఖా వాణి, సింగర్ మంగ్లీ, నందు, యంగ్ హీరో సుధాకర్ కోమాకుల, టీవి నటి సమీరా, యూట్యూబర్ మహమ్మద్ షేక్, హారిక, టివి నటుడు సయ్యద్ సోహైల్, హీరోయిన్ మోనాల్ గజ్జర్, నోయల్.. వీరితో పాటు మరో ఆరుగురు కూడా ఈ సీజన్లో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజమౌతుందన్నది తెలియాలంటే బిగ్‌బాస్ మేకర్స్ అఫీషియల్‌గా కంటెస్టెంట్లని ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.