
బిగ్ బాస్ లాంటి అతిపెద్ద రియాల్టీ షోలోకి కెరియర్ మెరుగవుతుందని అవకాశాలు వస్తాయని ఆశతో వెళ్లేవారు ఎంతోమంది. ఓ రకంగా ఇది నిజం కూడా. బిగ్ బాస్ వల్ల చాలామందికి అవకాశాలు వెత్తుకుంటూ వచ్చాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 తన అందాలతో కుర్రకారు మతి పోగొట్టిన దివికి కూడా రెండు బంపర్ ఆఫర్లు వచ్చాయని తెలుస్తుంది. ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఆమె కారణంగా బిగ్ బాస్ కు మసాలా రాకపోవటంతో ఎలిమినేటి చేసారని వార్తలొస్తున్నాయి. ఇది పక్కన పెడితే ఇంటి నుంచి బయటకు వచ్చిన ఈ అమ్మడుకి ఓటిటి లో రెండు వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించేందుకు ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తుంది. అందులో ఒకటి కొద్దీ రోజుల్లో షూటింగ్ ప్రారంభంకానున్నట్లు సమాచారం. ఏదేమైనా బిగ్ బాస్ దివికి బాగానే ఉపయోగపడింది.