
బిగ్ బాస్, తెలుగులో ఒక సంచలనం. ఈ షో వస్తుందంటే చాలు, ప్రతీ ఒక్కరూ టివిలకి అతుక్కుపోతారు.ఇప్పటివరకూ మూడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్లిన బిగ్ బాస్, నాల్గవ సీజన్ తో మన ముందుకు రాబోతుంది. బిగ్ బాస్ 4 కి సంబంధించిన టీజర్ ని టెలికాస్ట్ చేశారు. అయితే కంటేస్టెంట్లు కూడా ఎవరో అన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ అన్ అఫీషియల్ గా రెండు రకాల లిస్టులు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. మొదటి లిస్టులో నటుడు తరుణ్, యాంకర్ రశ్మి గౌతమ్, నందు, యామినీ భాస్కర్, యాంకర్ రవి, లాస్య, శ్రద్ధాదాస్, బిత్తిరిసత్తి, సింగర్ మంగ్లీ, హంసానందిని, హుషారు ఫేమ్ రమ్య పసుపులేటి, యూట్యూబ్ ఛానల్ యాంకర్ కోటి...మొత్తం 12 మంది ఉన్నారు. మరొక లిస్టులో పూనం భజ్వా, శ్రద్ధాదాస్, హంసానందిని, సింగర్ సునీత, సింగర్ మంగ్లీ, నందు, వైవా హర్ష, సీరియల్ యాక్టర్ అఖిల్ సార్థక్, యామిని భాస్కర్, మహాతల్లి యూట్యూబ్ ఛానల్ జాహ్నవి, అపూర్వ, జబర్దస్ట్ కమెడియన్ పొట్టి నరేశ్, యూట్యూబ్ స్టార్ మెహబూబ్ దిల్ సే, సింగర్ నోయల్, హుషారు ఫేమ్ ప్రియ వడ్లమాని..మొత్తం 15 మంది ఉన్నారు. ఈ రెండు లిస్టుల్లో కొంతమంది పేర్లు కామన్ గా ఉన్నాయి. ఐతే ఈ రెండు లిస్టులు ఫెక్ అని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది మాత్రం నిజమే అని నమ్ముతున్నారు. మరి ఈ రెండు లిస్టుల్లో ఉన్న వ్యక్తుల్లో బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టే అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.