
బిగ్గెస్ట్ రియాల్టీ షో అయిన 'బిగ్ బాస్' తెలుగులో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అందరూ నాలుగో సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యంగా స్టార్ట్ కానుంది. అయితే ఈ షోలో కంటెస్టెంట్స్ కోసం మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్లు ఎవారా అనేదానిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుండగా. తాజాగా బిగ్ బాస్ మేకర్స్ RX 100 ఫెమ్ కార్తికేయ, కృష్ణ అండ్ హిస్ లీల ఫెమ్ సిద్ధూ గొన్నలగడ్డను సంప్రదించగా వాళ్ళు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. వీరితో పాటు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫెమ్ సుధాకర్, గరుడ వేగా ఫెమ్ అదితి అరుణ్‌లు సంప్రదించగా వాళ్ళు అంగీకరించినట్లు తెలుస్తుంది.