
ఎప్పుడో మొదలవ్వాల్సిన బిగ్గెస్ట్ రియాల్టీ షో 'బిగ్ బాస్' కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కరోనా విపత్తితో వెనక్కి వెళ్లిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఇప్పుడు మరింత కొత్త హంగులతో, కొత్త జోష్ తో, ఊహించని కంటెస్టెంట్లతో ఎంతో పకడ్బందీగా మన ముందుకు రాబోతుందని మొన్నీమధ్యే చిన్న ప్రోమో ద్వారా తెలిపారు. ఇక ఆ తరువాత హోస్ట్ నాగార్జునానేనని ట్విట్టర్ లో నాగ్ మేకప్ వేసుకుంటున్న ఫోటో పెట్టడంతో కంఫర్మ్ అయింది. ఆ మేకప్ ప్రోమో షూట్ కోసమేనని తాజాగా రిలిజ్ అయిన ప్రమోషనల్ యాడ్ తో క్లారిటీ వచ్చేసింది. స్టార్ మా నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ నాగార్జునతో షూట్ చేసిన ప్రోమోను విడతల వారిగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన దాంట్లో నాగ్ ముసలి గెటప్ లో కనిపిస్తూన్నారు. ఇలా ఇంకో రెండు వేశాల్లో నాగ్ ప్రోమో ఉంటుందని సమాచారం. ఏదేమైనా అసలు షో నడుస్తుందా? ఏదైనా అడ్డంకు వచ్చి ఆగిపోతుందా? అని ఆలోచిస్తున్న ప్రేక్షకులకు ఈ ప్రోమో కాస్త ఊరటనిచ్చింది. అయితే ఈసారి సీజన్ లో ఎన్నో మార్పులు చూడటానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండాలని పరిస్థితులు చెప్తున్నాయి. ఎటువంటి అట్టకం కలగకుండా, షోపై మచ్చ రానికుండా , సురక్షితంగా సీజన్ ను పూర్తి చేసే దిశగా యాజమాన్యం అడుగులేస్తుంది. కాబట్టి ఈసారి సీజన్ లో బలమైన మార్పులు చేర్పులు తప్పనిసరి.