
బిగ్ బాస్ సీజన్ 4 మంచి జోరు మీదుంది. 16 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన షో ఇప్పుడు 11 మందితో ముందుకు సాగుతుంది. ఇక ఈ వారం మనుషులు-రాక్షసులు టాస్క్ ను ఇంటి సభ్యులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడినట్లు కనిపిస్తుంది. ప్రతి టాస్క్ లో ఇదొక రచ్చ చేసే హౌస్ మేట్స్ ఈ టాస్క్ లో కొంత సౌమ్యంగా, గొడవలు లేకుండా ముగించారు. ఇకపోతే కెప్టెన్సీ టాస్క్ కు అవినాష్ మరియు అరియనా ఎంపిక అవ్వగా వాళ్లకు ఇంటి సభ్యులను తోపుల బండిపై ఒక్కొక్కరిగా ఎక్కించుకొని ఒక రౌండ్ కంప్లిట్ చేయాలి. అల..ఎవరు ఎక్కువ రౌండ్లు తోస్తే వాళ్ళు కెప్టెన్ అవుతారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా ఇంటి కొత్త కెప్టెన్ అవినాష్ అని తెలుస్తుంది. ఈ లెక్కన ఈ వారం నామినేషన్స్ నుంచి అవినాష్ సేవ్ అవుతే వచ్చే వారం అతనికి ఇమ్యూనిటీ వచ్చినట్లే.