
బిగ్ బాస్ మూడు సీజన్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకొని ఇప్పుడు నాలుగో సీజన్ తో మన ముందుకు వచ్చింది. అయితే మనం సుమారు మర్చిపోయిన నటుడు 'అభిజిత్'. అక్టోబర్ 11, 1988 న జన్మించిన అభిజీత్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసాడు. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం ఆడిషన్స్ కు వెళ్లడం అందులో లిడ్ రోల్ కి సెలెక్ట్ అవ్వడంతో హీరోగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అసలు అవకాశం రాకపోవడంతో కెరియర్ లో కొంత టైం తీసుకొని 'పెళ్లి గోల' వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది మూడు సీజన్లు మంచి విజయం సాధించినప్పటికి అభిజిత్ కు అవకాశాలు కరువయ్యాయి. దీంతో బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అభిజిత్ ఫ్యామిలీకి నిర్మాణ రంగంలో మంచి అనుభవం ఉంది. ఆయన పూర్వీకులు చార్మినార్ నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. ఇప్పటికి అతని కుటుంబం నిర్మాణ రంగంలో ఉండగా తను మాత్రం సినిమాల్లో నటించేందుకే మొగ్గుచూపుతున్నాడు.