
బిగ్ బాస్ సీజన్ మొదలైన తర్వాత ఎవరొస్తున్నారు.. ఎంతమంది వస్తున్నారు.. ఎలా ఉన్నారు అనేది మాత్రమే చూస్తున్నారు కానీ లోలోపల మరో ప్రశ్న కూడా అందరిలోనూ ఉండిపోయింది. ఈ షోలో కుటుంబాలను వదిలి అన్ని రోజులు ఉండటానికి వచ్చిన కంటెస్టెంట్స్‌కు ఎంతమాత్రం ఇస్తారు.. ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న వాళ్లతో పాటు ఎలిమినేట్ అయిన వాళ్లు కూడా రోజు వారి లెక్కలో ఎవరికి ఎంత పారితోషికం ఇస్తున్నారో తెలుసా..?
జబర్దస్త్ తో ఫెమస్ అయిన ముక్కు అవినాష్ కు రోజుకు దాదాపు 60 వేలు.
యాంకర్ లాస్యకు దాదాపు 50 వేలు.
అందాలతో హీట్ పెంచుతున్న మోనాల్ గజ్జర్ కు 40 వేలకు పైగానే.
అప్పుడప్పుడు డ్యాన్స్‌లు, గొడవలతో కంటెంట్ ఇస్తున్న అమ్మ రాజశేఖర్ కు రోజుకు 40 వేలు
సడన్ గా సైలెంట్ అయిన సింగర్ నోయల్ కు రోజుకు 40 వేలు.
ఉర మాస్ మాటలతో ఎంటర్టైన్ చేస్తున్న దేత్తడి హారికకు 30 వేలు.
మెరుపుతిగలాగా వచ్చి వెళ్లిన స్వాతి దీక్షిత్ కు 30 వేల పైనే.
ఇంటికే ముద్దుల అవ్వ అయిన గంగవ్వకు 25 వేలకు పైగానే
తొందరగా తుస్సుమన్న కరాటే కళ్యాణికు దాదాపు 25 వేలు
బోల్డ్ గా మాట్లాడి ఇంటి నుండి వెళ్లిపోయిన యాంకర్ దేవి నాగవల్లికు 25 వేలకు పైగానే
విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అభిజీత్ కు 25 వేలు
ఇంట్లో అర్జున్ రెడ్డిలా మారిన సోహైల్ కు 15 వేలు.
సొట్టబుగ్గల సుందరి దివికు రోజుకి 15 వేలు
అమ్మయితో సతమతమవుతున్న అఖిల్ సార్థక్ కు 15 వేలు
బోల్డ్ పాపా అరియానాకు 15 వేలు.
మరో బిగ్ బాస్ లా ఫీల్ అయ్యి మొదటి వారంలొనే వెళ్లిపోయిన సూర్య కిరణ్ కు 10 వేలు.
స్నేహమేర జీవితం అంటూ సాగుతున్న మెహబూబ్ కు కూడా 10 వేలు
జోర్ధార్ మాటలతో మొన్నటి వరకు అలరించిన సుజాతకు 10 వేలు.
సైలెంట్ గా ఉంటూ గేమ్ ఆడుతున్న కుమార్ సాయి కు వారానికి 10 వేలు.
సో మొత్తంగా ఇంట్లో అందరికన్నా ఎంటర్టైన్ చేస్తున్న అవినాష్ కే రెమ్యునరేషన్ ఎక్కువ అన్నమాట!