
బిగ్ బాస్ 4 తెలుగు మొదటి వారం టిఆర్పీలు దేశంలోని అత్యధిక రేటింగ్స్ నమోదు చేశాయని షో హోస్ట్ కింగ్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్లో ఇంటి సభ్యులతో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యమాని ప్రేక్షకులు గట్టిగానే షోను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. నిన్న ఎపిసోడ్లో ఒక టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. మనుషులు, రోబోలు అంటూ రెండు గ్రూపులుగా డివైడ్ చేసి మనుషుల అవసరాల కోసం రోబోలకు ఛార్జింగ్ పెట్టాలి లేదా బిగ్ బాస్ ఇచ్చిన రోబో బంతిని పగలకోడితే ఒక రోబో చచ్చిపోతుంది. అల....ఒక్క రోబో మిగిలున్న టాస్క్ రోబోలు గెలిచినట్లు లేదా అన్ని రోబోలను చంపితే మనుషులు గెలిచినట్లు. అయితే ఇంతలోకి లాస్య రోబో ఛార్జింగ్ రెండు పాయింట్లు కిందకి పడింది. దీంతో బెరాలు మొదలుపెట్టిన ఇరు టీంలు ఒక్క పాయింట్ కి ఒక్క సిగరెట్ అంటూ అమ్మా రాజశేఖర్ ను ఆడుకున్నారు. కాబట్టి బాత్ రూమ్ కావాలన్న కూడా రోబోలతో బెరాలు జరపాలి. కానీ వాళ్ళను ఎలాగైనా చంపాలనే కసితో ఉన్న మనుషులు వాళ్ళను అడగకుండా చేయకూడని పని ఒకటి చేశారు. దివి, సుజాతకు బాత్ రూమ్ అవసరం రావడంతో స్మోకింగ్ జోన్ లో దుప్పటి అడ్డు పెట్టి పని కానిచ్చారు. నోయెల్ ఏమో ఆ సమయంలో కెమెరాలకు దిండ్లు అడ్డుపెట్టాడు. ఇది చూసిన బిగ్ బాస్ కెమెరాలకు ఏది అడ్డుపెట్టడానికి వీళ్ళేదని మనుషుల టీంను గట్టిగా మందలించాడు. మళ్ళీ రెండు మూడు బెరాలతో రోబోలు మనుషుల టీంతో మాట్లాడేందుకు ప్రయత్నించిన లాభం లేకపోయింది.