
బిగ్ బాస్ 4 రోజు రోజుకు ఉహించని విధంగా మలుపులు తిరుగుతుంది. 16 మంది కంటెస్టెంట్లలో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేటి అవ్వడం. ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీలుగా ఇంట్లోకి రావడం జరిగింది. ఇకపోతే గత మూడు రోజులుగా రోబోలు-మనుషుల టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్క రోబో బ్రతికున్న మనుషుల టీం ఓడిపోతుందని బిగ్ బాస్ ముందుగానే చెప్పడం జరిగింది. అయితే రోబోలు ఎంతో చాకచక్యంగా మనుషుల టీం నుంచి దివిను కిడ్నాప్ చేసి ఆమెకు తిండి, బాత్ రూమ్ సదుపాయం ఇచ్చి ఆమె నుంచి ఛార్జింగ్ తీసుకొని రోబోలు కొంత వరకు అక్కడే గేమ్ గెల్చేసారు. ఇక ఆ తర్వాత గంగవ్వ రంగంలోకి దిగింది ఆమె ఉన్న రోబోల టీం కోసం గట్టిగానే ప్రయత్నించింది. ఆ వయసులో...మోనాల్ కు అడ్డుపడుతూ, మిగితా వారిని ఆమె అమాయకత్వంతో, మాటలతో కప్పిబుచ్చుతూ ఛార్జింగ్ తీసుకుంది. అవ్వ ఆడిన ఆటతీరును చూసి ప్రేక్షకులు అవ్వాక్ అయ్యారు. ఈ వయసులో బిగ్ బాస్ హౌస్ లో ఎం చేస్తుందిలే అనుకున్న వాళ్ళ నోర్లు గట్టిగ మూయించేసింది అవ్వ.