
బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెంట్ ఇవ్వడం ఎంత ముఖ్యమో గేమ్ ను తెలివిగా ఆడటం అంతే ముఖ్యం. గేమ్ ను ఎంత తెలివిగా ఆడారు అనేదానిపై వారి విజయం ఆధారపడి ఉంటుంది. ప్రతి వారం నామినేషన్లలో ఉండే వారి నుంచి ప్రేక్షకులు తమకు నచ్చిన వాళ్లకు ఓట్లు వేసి సేవ్ చేయటం జరుగుతుంది. గేమ్ బాగా ఆడేవాళ్లకు ఎలాగైనా ఓట్లు పడతాయి లేదా మంచి పీఆర్ టీం ఉన్న వాళ్లకు బాగానే పడతాయి మధ్యలో అటు గేమ్ సరిగ్గా ఆడక ఇటు ప్రమోషన్ ఎక్కువగా లేని వాళ్ళకే కష్టం. ఆ స్టేజ్ లో ఉన్న ఇద్దరు భామలు దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్. హారిక గేమ్ పరంగా బాగా ఆడుతున్న ప్రమోషన్ ఎక్కువ లేదు అందుకే నాభి అందాలు ఆరబోస్తూ యూత్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక మోనాల్ గజ్జర్ ఇద్దరి కృష్ణుల ముద్దుల రాధగా ఉంటుందే తప్ప గేమ్ సరిగ్గా ఆడటం లేదు అందుకే వీకెండ్ వస్తే చాలు క్లివెజ్ షోలతో మత్తెక్కిస్తుంది. కానీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కుటుంబాలు కలిసి చూసే ఒక షో కాబట్టి అది గమనించుకొని ఉంటే బాగుంటుందేమో.