
బిగ్ బాస్ తెలుగు 4 ఎట్టకేలకు మూడు వారాల క్రితం ప్రదర్శించబడింది. ఉహించినట్లుగా, ఎలిమినేషన్లు కూడా జరిగాయి. అల...తాజాగా ఇంటి నుండి ఎలిమినెట్ అయిన కంటేస్టెంట్ కరాటే కళ్యాణి. ఇంటి నుండి బయటికి వచ్చిన ఆమె ఒక ఇంటర్వ్యూలలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె బిబి ఇంటి లోపల కనీసం 5 వారాల పాటు ఉండాలని కోరుకున్నాని, అది తనకు ఆర్ధికంగా కూడా చాలా మేలు చేసేదని మొదలుపెట్టి హౌస్ పై పలు కీలక ఆరోపణలే చేసింది. లాక్డౌన్ కారణంగా నేను తీర్చాల్సిన కొన్ని అప్పులు ఉన్నాయి. హౌస్ లో ఇంకొన్ని వారాలు ఉండి ఉంటే ఆ అప్పులు కొంత తిరేవి. నేను చేసిన తప్పు....సెల్ఫ్ నామినేషన్ కు వెళ్లడం. ఆ రోజు బోట్ లో ఉన్నప్పుడు ఎమోషనల్ గా ఆలోచించకుండా తెలివిగా గేమ్ ని గేమ్ లాగా ఆడి ఉంటే కనీసం ఇంకో రెండు మూడు వారాలు ఇంట్లో ఉండేదానంటూ చెప్పుకొచ్చారు. అంతే కాదు, ఓటింగ్ పద్దతిలో ఏదో తప్పుందని....తనకి ఓటు వేస్తుంటే వేరే అభ్యర్థికి మళ్లించారని కొంతమంది చెప్పినట్లుగా ఆమె ఆరోపించారు. ఇక చివరిగా హోస్ట్ నాగార్జున ఎలిమినేషన్ తర్వాత తనను మాట్లాడనివ్వకపోవడం చాలా బాధ కలిగిందని తెలియజేసారు. ఏదేమైనా బిగ్ బాస్ వారు మళ్ళీ తనను వైల్డ్ కార్డు ఎంట్రీగా వెళ్లమంటే ఇప్పటికిప్పుడు రెడీగా ఉన్నాని తెలిపారు.