
బిగ్ బాస్ సీజన్ 4 రెండు వారల తర్వాత ఆసక్తికరంగా మారుతోంది. గత వారాంతపు చివరిలో వచ్చి హౌస్ మేట్స్ తో మాట్లాడిన అక్కినేని నాగార్జున ఇకపై ఎవరూ సేఫ్ గేమ్ ఆడకుండా చూసుకున్నారు. సోమవారం నామినేషన్ల ప్రక్రియ పోటీదారుల మధ్య తీవ్ర వాదనలకు దారి తీసింది. అఖిల్ మరియు కుమార్ సాయి, కుమార్ సాయి మరియు సోహైల్ కూడా నామినేషన్ల ప్రక్రియలో గొడవకు దిగారు. అరియానాను సోహైల్ నువ్వు ఎలాంటి దానివో తెలుసులే అనడంతో రచ్చ మొదలయింది. దేవి నాగవల్లిని కరాటే కళ్యాణి వెళ్తూ వెళ్తూ బిగ్నే బాంబ్ లో భాగంగా నేరుగా నామినేట్ చేశారు. ఇకపోతే కెప్టెన్ గా ఉన్ననోయెల్ సీన్ కు ఒక పోటీదారుని నేరుగా నామినేట్ చేసే శక్తిని బిగ్ బాస్ ఇచ్చారు. దీంతో నోయెల్ సీన్ లాస్యాను నేరుగా నామినేట్ చేయడానికి ఎంచుకున్నాడు. తరువాత నామినేషన్ల ప్రక్రియలో, అరియానా, కుమార్ సాయి, మెహబూబ్, హరికా, మోనాల్ గజ్జర్ కూడా నామినేట్ అయ్యారు. మరి మూడవ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.