
బిగ్ బాస్ సీజన్ 4 మూడవ వారంలోకి వచ్చింది. ఇప్పటికే షో నుండి సూర్య కిరణ్ మరియు కరాటే కల్యాణి ఇద్దరు పోటీదారులు ఎలిమినేటి అయ్యారు. కుమార్ సాయి మరియు అవినాష్ ఇద్దరు పోటీదారులు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చిన విషయం తెలిసిందే. మూడవ వారం నామినేషన్లో 7 మంది పోటీదారులు నామినేట్ అయ్యారు. అయితే అందులో ఎవరు ఎలిమినేటి అవుతారనేది ఆసక్తికరంగా మారింది. దేవి నాగవల్లి, మోనాల్ గజ్జర్, అరియానా, కుమార్ సాయి, మెహబూబ్, లాస్య, హరిక నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురిలో మా నివేదికల ప్రకారం, హరిక, లాస్యా, మోనాల్, కుమార్ సాయి ఇప్పటికే సేఫ్ జోన్లో ఉన్నారు. ఈ నలుగురు పోటీదారులకు మెజారిటీ ఓట్లు పోలవుతున్నాయి. ఇక మిగిలింది అరియానా, మెహబూబ్, దేవి నాగవల్లి. వారిలో మెహబూబ్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నాడు. అతను ఇతర పోటీదారులతో కలిసిపోతున్నాడు. అలాగే, అతను ఫిజికల్ టాస్క్‌ల్లో బాగా ప్రదర్శిస్తాడు. కాబట్టి మెహబూబ్ కూడా సేవ్ అవ్వచ్చు. అయితే, దేవి నాగవల్లి మరియు అరియానా ప్రస్తుతానికి డేంజర్ జోన్లో ఉన్నారు. మరి వీరిలో మూడవ వారంలో ఎవరు ఎలిమినేటి అవుతారో చూడాలి.