
అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 4 ను తెలుగు ప్రేక్షకులు విస్తృతంగా ఆదరిస్తున్నారు. అయితే మీరు షోను క్రమం తప్పకుండా చూస్తుంటే, మొదటి వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేసిన కుమార్ సాయి హౌస్‌మేట్స్‌కు సాఫ్ట్ టార్గెట్ గా మరాడని అర్థం అవుతుంది. ఒకరు లేదా మరొకరు అతనితో తగాదాలగా దిగుతున్నారు. కొన్నిసార్లు, కుమార్ సాయి తన అభిప్రాయాలను వారితో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా హౌస్ మేట్స్ వినేందుకు సిద్ధంగా లేరు. దీంతో ప్రేక్షకులలో అతనిపై సానుభూతి పెరిగిందని తెలుస్తోంది. మీకు గుర్తుంటే, మునుపటి సీజన్లో, టీవీ హోస్ట్ శ్రీముఖి, సింగర్ రాహుల్ సిప్లిగుంజ్ను ఎప్పటికప్పుడు నామినేట్ చేస్తూనే ఉండేది. అది కాస్త అతనికి ప్లస్ పాయింట్‌గా మారింది. చివరకు అతను ప్రేక్షకుల మద్దతుతో మునుపటి సీజన్ విజేతగా నిలిచాడు. ప్రస్తుతం, కుమార్ సాయి కూడా అదే తరహాలో...గంగవ్వాతో సహా ఇంట్లో ప్రతి ఒక్కరితో నామినేట్ చేయబడుతున్నాడు. కుమార్ సాయి ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు, కాని సోమవారం ఎపిసోడ్ తరువాత, వారిలో అతనిపై తమ అభిప్రాయం మార్చుకున్నారు. ప్రతి ఎపిసోడ్ ను వీక్షిస్తున్న అభిమానుల నుండి కుమార్ సాయికి భారీ మద్దతు లభిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. మరి అల...చూసుకుంటే కుమార్ సాయి ఈ సీజన్ విన్నర్ అవుతాడా? ఏమో చూద్దాం!