
బిగ్ బాస్ 4 తెలుగు చూస్తుండగానే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈసారి కరోనా కారణంగా మంచి సెలెబ్రిటీలు వస్తారనుకుంటే పెద్దగా తెలియని మొఖాలే కనిపించాయి. దీంతో షోపై ఆసక్తి కోల్పోతున్న సమయంలో యాజమాన్యం ఇంటి సభ్యుల మధ్య చిచ్చులు పెట్టె టాస్క్ లతో రక్తికట్టించింది. చూస్తుండగానే రెండు ఎపిసోడ్ లు పూర్తవ్వడం, ఇద్దరు ఎలిమినేటి అవ్వడం కూడా జరిగింది. మొదటి వారంలో దర్శకుడు సూర్య కిరణ్ ఎలిమినేటి కాగా రెండో వారంలో కరాటే కళ్యాణి ఎలిమినేటి అయింది. ఇకపోతే మొదటి వారంలోనే నటుడు సాయి కుమార్ ను వైల్డ్ కార్డు ఎంట్రీగ దింపిన బిగ్ బాస్ రెండో వారంలో ఎవరు ఊహించని విధంగా జబర్దస్త్ అవినాష్ ను మరో వైల్డ్ కార్డు ఎంట్రీగా దింపారు. సరే ఇకపై ఇలాంటి షాకింగ్ ఎంట్రీలు ఉండవనుకుంటే తప్పే. యాజమాన్యం మరో ఎంట్రీను ప్లాన్ చేస్తుంది. ఈసారి టాలీవుడ్ నటిను రంగంలో దింపనున్నట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు అల్లరి నరేష్ నటించిన జంప్ జిలాని హీరోయిన్ స్వాతి దీక్షిత్. ఈమె ఎంట్రీ ఇస్తే గ్లామర్ డోస్ తో పాటు షో మరింత ఆసక్తికరంగా మారుతుందని భావిస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ చూడాలి.