
బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో ప్రారంభమైనప్పటి నుంచి సీజన్ కి ఒకరికి బయట మాస్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అందులో ముఖ్యంగా సీజన్ 2 లో కౌశల్ కు ఆర్మీ పేరుతో ఎంత క్రేజ్ వచ్చిందో ఇప్పుడు సీజన్ 4 లో అభిజీత్ కు నాతటి క్రేజ్ ఏర్పడింది. కానీ బిగ్ బాస్ టీం మాత్రం అభిని కావాలని టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం బాగా సాగింది. కానీ నిన్నటి ఎపిసోడ్ లో హౌజ్‌మేట్స్ కు వాళ్ళ జర్నీను చేయించిన బిగ్ బాస్ ఒక్కరి గురించి ఒక స్టేట్మెంట్ ద్వారా చెప్పారు. అల...బిగ్ బాస్ అభిజీత్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. భిజిత్ గురించి బిగ్ బాస్ చెప్పిన మాటలు ఇంత వరకు ఏ సీజన్లోనూ మరే కంటెస్టెంట్‌కు చెప్పి ఉండడు. ఎంతో పరిపక్వత చెందిన మీలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ షోలో ఉండటం ఎంతో గర్వంగా ఉందని బిగ్ బాస్ ప్రశంసించాడు. ఆ మాటలకు అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు.