
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అభిజీత్ కు బయట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఎంతలా అంటే...సీజన్ 2 కౌశల్ తర్వాత మళ్ళీ సీజన్ 4 లో అభిజీత్ కు ఆ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే నిన్నటి దెయ్యం టాస్క్ లో ఇంటి సబాయులు ఎవ్వరు సరిగ్గా పర్ఫామ్ చెయ్యలేదని చెప్పిన బిగ్ బాస్ అభిజీత్ ను వరస్ట్ పర్ఫామర్ గా ప్రకటించారు. బిగ్ బాస్ చేసిన ఆ ప్రకటనతో అభిజీత్ ఫ్యాన్స్ కోపంతో రగిలిపోతున్నారు. మొన్న మోనాల్ ను ఏడిపించిన కారణంగా మీ ఇద్దరిలో ఎవరో ఒకరు డేట్ కి తీసుకెళ్లాలి అంటూ అఖిల్ మరియు అభిజీత్ కు టాస్క్ ఇచ్చారు. అయితే మోనాల్ ను ఏడిపించటం అనే లైన్ అభిజీత్ కు నచ్చలేదు తానేమి ఏడిపించలేదు కాబట్టి డేట్ కి తీస్కెళ్లలేదని ఫ్యాన్స్ అభిజీత్ ను వెనుకేసుకొస్తున్నారు. మరి ఏది తప్పో, ఏది ఒప్పో ఈరోజు నాగార్జున వస్తే తెలుస్తుంది.