
ఇటీవల, బిగ్ బాస్ తెలుగు 4 ను గ్రాండ్ గా ప్రదర్శించారు. ప్రతిరోజూ రాత్రి 9:30 నుండి 10:30 గంటల మధ్య ప్రసారం అయ్యే బిగ్ బాస్ తెలుగు 4, సెప్టెంబర్ 6న స్టార్ట్ అయింది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. కొన్నీ వర్గాల సమాచారం ప్రకారం, బిగ్ బాస్ తెలుగు 4 యొక్క ప్రారంభ ఎపిసోడ్ కు 18.7 టిఆర్పి దక్కింది. ఇది మునుపటి సీజన్ల ప్రారంభ ఎపిసోడ్ టిఆర్పీలను క్రాస్ చేసింది. అసలు కొత్త మోహాలు, సప్పగా సాగుతుందని అనిపించినా యాజమాన్యం మెల్లిగా దాన్ని రసవత్తరంగా మార్చే పనిలో పడింది. వాళ్ళ ప్రయత్నం కొంతవరకు సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఇప్పుడిప్పుడే షోలో జోష్ కనిపిస్తుంది. మరి మొత్తంగా సీజన్ 4 మిగితా సీజన్ల కంటే సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.