
బిగ్ బాస్, తెలుగులో ఒక సంచలనం. ఇప్పటివరకూ మూడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్లిన బిగ్ బాస్, నాల్గవ సీజన్ తో మన ముందుకు రాబోతుంది. ఎప్పుడో రావాల్సిన షో, కరోనా కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. బిగ్ బాస్ 4 కి సంబంధించిన టీజర్ ని టెలికాస్ట్ చేశారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా షో ఆగిపోకుండా యాజమాన్యం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటూ ఆగస్టు 30న స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈనేపథ్యంలో కంటెస్టెంట్లకు కరోనా పరీక్ష చేయగా ఒకరికి పాజిటివ్ అని తేలింది. అతను ఒక గాయకుడు అని తెలుస్తోంది. దీంతో అతన్ని క్వారెంటైన్ లోకి పంపి షో మొదలవ్వడానికి ముందు మరోసారి పరీక్ష చేసి నెగిటివ్ అని తేలితే హౌస్ లోకి ఎంట్రీ లేకపోతే అతని స్థానంలో వేరే కంటెస్టెంట్ తెస్తారు. అయితే ఇలాంటి ఎన్నో ఆటంకాలను యాజమాన్యం మునుముందు ఎదురుకోవాల్సి ఉంటుంది.