
బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి ఇప్పుడు నాలుగో సీజన్ కు సిద్ధమవుతుంది. మరిన్ని నవ్వులు, గొడవలు, గాసిప్పులతో మీముందుకు మళ్ళీ వస్తున్నానని ప్రోమో ద్వారా అక్కినేని నాగార్జున చెప్పారు. ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్-4 వస్తుందని వార్తలు వచ్చాయో అప్పటి నుంచి ఇంటి కంటెస్టెంట్ల గురించి సోషల్ మీడియాలో ఎడతెరిపి లేకుండా పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఎన్ని పుకార్లు వచ్చినా షో స్టార్ట్ అవుతే కానీ ఎవరూ ఇంట్లో ఉన్నారనే విషయంపై క్లారిటీ రాదు. మరి షో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? విక్కీపిడియా ద్వారా బిగ్ బాస్ సీజన్-4 ఆగస్టు 30న నాగార్జున హోస్ట్ గా ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది. 15 మంది కంటెస్టెంట్లతో 105 రోజులు, 106 ఎపిసోడ్లతో ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో ఇక నెలాఖరు నుండి బిగ్ బాస్ హవా మొదలవుతుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు.