
అనుకున్నదొక్కటి అయ్యిందోక్కటి. రోజంతా పని చేసి, చదువుకొని, మొత్తానికి అలిసిపోయి హాయిగా టీవీలో వచ్చే బిగ్ బాస్ చూస్తూ ఉండాల్సిన వాళ్ళము, ఇంట్లో రేపు ఏమవుతుందో తెలియక చస్తూ బ్రతుకుతున్నాం. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా లెట్ అయినా సరే బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ను ప్రారంభిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో పుకార్ల వర్షం మొదలైంది. ఈనేపథ్యంలో తాజాగా వస్తున్న ప్రచారం ప్రకారం, ఇంట్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లు కచ్చితంగా క్వారెంటైన్ లో ఉండబోతున్నారని తెలుస్తోంది. క్వారెంటైన్ త్వరిత స్వాబ్ పరీక్ష చేసి నెగిటివ్ వచ్చిన వారిని లోపలికి పంపే ఏర్పాటు చేస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం. మరి అన్నీ జాగ్రత్తలు పాటిస్తూ షోను విజయవంతగా నడపగలదో లేదో చూడాలి.