
బిగ్ బాస్ సీజన్ 4 ఆరోవ వారంలోకి అడుగుపెట్టబోతుంది. రోజు రోజుకు ఇంట్లో వారి మధ్య ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఎప్పుడు కొట్టుకుంటారో, ఎప్పుడు ముద్దులాడుకుంటారో తెలియని పరిస్థితి. అయితే రోజు రెండు మూడు గొడవలు, తిట్లు, నవ్వుల మధ్య సాగే బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్లో మాత్రం ఇంటి సభ్యులందరు తమ బాధను వెళ్లగక్కారు. ఈ ఫెమ్, నేమ్ వెనుక ఎవరికి తెలియని కధలు ఉన్నాయంటూ అందరూ తమ స్టోరీలను చెప్పి ఎడిపించారు. అందులో అరియానా గ్లోరిది మరి ఎమోషనల్ గా సాగింది.
"మా అమ్మ నాన్న నా చిన్న వయసులోనే విడిపోయారు, మాకు మగదిక్కు లేదు మా అమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్స్ అవ్వటం వల్ల ఏ లోటు లేకుండా పోషించగలిగింది. మా అమ్మ మంల్ని బాగా పెంచింది. నేను యాంకరింగ్ చేస్తా అన్నప్పుడు మొదట్లో ఒప్పుకోలేదు కానీ నాకు చదువు అబ్బలేదు మరి నేనేం చేస్తా అంటూ ఎదురుతిరిగి యాంకరింగ్ లోకి వచ్చాను. అక్కడ కూడా పాలిటిక్స్, నన్ను తొక్కేసారు. డబ్బులు లేక పస్తులున్న రోజులున్నాయి. రూ.500, 800 కోసం ఇవేంట్లు చేశాను. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంత పెద్ద రియాల్టీ షోలోకి వచ్చాను" అని ఆమె కధను షార్ట్ గా చెప్పి అందరిని ఏడిపించింది.