
అన్ని భాషల్లో కల్ల బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రత్యేకమని చెప్పక తప్పదు. అది కేవలం ఎక్కడో పొలంలో కూలీగా పని చేసుకునే 50 ఏళ్ల గంగవ్వను ఇంట్లోకి తెచ్చి కొత్త ప్రయోగం చేసిన యాజమాన్యం అందులో సక్సెస్ అయింది. సీజన్ మొదట్లో మైలేజ్ తెచ్చింది గంగవ్వనే. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తు ఎవరు ఉహించని విధంగ గేమ్ అను అద్భుతంగా ఆడి ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు కుడా అవ్వాక్ అయ్యేలా చేసింది. ఇక బాగా సాగుతుందని అనుకున్న సమయంలో గంగవ్వ ఆరోగ్యం దెబ్బతినడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపాల్సి వచ్చింది. ఇంటి నుంచి వెళ్లే సమయంలో స్టేజ్ పై బిగ్ బాస్, నాగార్జునను తనకు ఒక ఇల్లు కట్టివమని కోరింది. దానికి బిగ్ బాస్ మరియు నాగార్జున గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే తాజా మీడియా సమావేశంలో గంగవ్వ మాట్లాడుతూ....దసరా నాడు బిగ్ బాస్ ఒప్పుకుంటే ఇల్లు కట్టుకోవడానికి ముగ్గు పోసుకుంటానని చెప్పింది. కానీ బిగ్ బాస్ నుండి ఎటువంటి సమాధానం లేదు. అయితే బిగ్ బాస్ నిబంధనల ప్రకారం ఇప్పుడే చేయలేరని త్వరలోనే గంగవ్వకు ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చి ఇల్లు కట్టిస్తారని తెలుస్తోంది. కొంచెం లెట్ అయిన గంగవ్వకు ఇల్లు పక్కాగ నిర్మిస్తారని తెలుస్తోంది.