
అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 స్టార్టింగ్ లో బోరింగ్ గా ఉన్నా గత కొన్నిరోజులుగా మాత్రం షో బాగానే పుంజుకుంది. రేపు ఇంట్లో ఎం జరుగుతుందో? అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో క్రియేట్ చేయడంలో షో నిర్వాహకులు సక్సెస్ అయ్యారు. ఇది పక్కన పెడితే 4 వారల నుంచి హౌస్ లో జరుగుతున్న సంఘటనల దృశ్య అలానే కంటెస్టెంట్లకు బయట ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఫైనల్ లో ఉండే 5 ఇంటి సభ్యులు వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇంతకీ వారు ఎవరంటే... 5వ స్థానంలో అఖిల్, 4వ ప్లేస్ లో గంగవ్వ, 3వ స్థానంలో దివి, 2వ స్థానంలో సోహెల్ ఇక మొదటి స్థానంలో అభిజీత్ ఉన్నాడు. ఈ ఐదుగురికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరు ఎన్నిసార్లు నామినేట్ అయినా చివరి వరకు ఉండటం ఖాయంగా కనిపిస్తుందని పలువురి అభిప్రాయం. మరి మునుముందు ఇది నిజమవుతుందో చూద్దాం.