
తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 పూర్తయ్యి కనీసం రెండు నెలలు కూడా అవ్వలేదు. అప్పుడే సీజన్ 5 హంగామా సోషల్ మీడియాలో మొదలైపోయింది. 'అరే ఏంట్రా ఇది' అని అందరూ అనుకుంటూనే రాబోయే సీజన్ లో ఎవరు ఉంటారా అని ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో కూడా రచ్చ జరుగుతుంది. ఇంతకీ దాని సంగతేంటి అంటే...5వ సీజన్‌ను నిర్వాహకులు ఏప్రిల్ నెలలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కంటెస్టెంట్లను ఫిల్టర్ చేసే పనిలో ఉన్నారు. పలు యూ ట్యూబ్ కంటెట్స్ తో ఆకట్టుకున్న షణ్ముక్ మొదటి కంటెస్టెంట్ గా ఫిక్స్ అయినట్లు రూమర్స్ వస్తున్నాయి. అలానే డ్యాన్స్ లతో యూట్యూబ్ లో దుమ్ము లేపే శ్వేతా నాయుడిని కూడా అడిగినట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.