
నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 రసవత్తరంగా మారుతుంది అనాలా? ప్రేక్షకుల అభిప్రాయాలను యాజమాన్యం లెక్క చేయట్లేదు అనాలా? తెలీదు. సరే ఇదంతా పక్కన పెడితే ఎడో వారంలోకి ఎంటర్ అయిన రియాల్టీ షో వాడివేడిగా సాగుతుంది. గత వారం ఎలిమినేషన్ తో నెటీజన్లకు బిగ్ బాస్ పై వ్యతిరేకత పెరిగిపోయింది. మోనాల్ ను సేవ్ చేసేందుకు కుమార్ సాయిను ఎలిమినెట్ చేసిన బిగ్ బాస్ యాజమాన్యం నిన్నటి నామినేషన్ ప్రక్రియలో మంచి ఫిట్టింగే పెట్టారు. హౌస్ లో తమకు మంచి కనెక్షన్ ఉన్న వాళ్ళను జత చేసి వారిలో ఒకరు నామినేట్ అయ్యేలా ప్లాన్ చేశారు. దీంతో అభిజిత్-హారిక జంటలో హారిక నామినేట్ కాగా, సోహెల్-అవినాష్ లలో అవినాష్ నామినేట్ అవ్వగా, అఖిల్-మోనాల్ జంటలో మోనాల్ నామినేట్ కాగా, అరియానా-మెహబూబ్ లలో అరియానా, లాస్య-దివిలలో దివి నామినేట్ అయ్యారు. ఇక గత వారం బిగ్ బాస్ డీల్ ను అంగీకరించిన నోయేల్ నేరుగా నామినేట్ అయ్యాడు. కాబట్టి మొత్తంగా ఈసారి నామినేషన్లలో ఆరుగురు ఉన్నారు. మరి ఈసారైనా మోనాల్ కు వ్యతిరేకంగా ఓట్లు పడితే ఆమెను ఇంట్లో నుంచి పంపిస్తారా లేదా అనేది చూడాలి.